ముఖాలు అద్దెకిచ్చి లక్షలు సంపాదిస్తున్న చైనీయులు

ఏఐతో ఉద్యోగాలు పోతాయని భయపడుతున్న తరుణంలో, చైనాలో కొందరు తమ ముఖాలను అద్దెకిచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ముఖాలను రిజిస్టర్ చేసుకుని, వాటిని ఏఐ ద్వారా వీడియోలు, ప్రకటనలు, గేమ్స్, షార్ట్ డ్రామాల్లో ఉపయోగించుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. దీనికి 50 యువాన్ల నుంచి 99,999 యువాన్ల వరకు (సుమారు రూ.700 నుంచి రూ.14 లక్షలు) చెల్లిస్తున్నారు. అయితే, గోప్యత, ముఖ డేటా భద్రత, పిల్లల ముఖాల వినియోగం, ఒప్పందాల రద్దుపై జరిమానాలు వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕