సౌదీ సంప్రదాయం, చైనా టెక్నాలజీ కలగలిసిన ఓ అరుదైన ప్రదర్శన రియాద్‌లో జరిగింది. చైనా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, సాంప్రదాయ సౌదీ దుస్తులు ధరించిన చైనీస్ హ్యూమనాయిడ్ రోబోలు అర్దా కత్తి నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాయి. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ విందులో, రోబోలు సంగీతానికి అనుగుణంగా కత్తులు ఊపుతూ నృత్యం చేశాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చైనా రోబోటిక్స్, కృత్రిమ మేధస్సులో సాధిస్తున్న పురోగతికి ఇది నిదర్శనమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.