‘కోట’ పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి (వీడియో)

కోట శ్రీనివాసరావు పార్థివదేహానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘ప్రాణం ఖరీదు’తో ఆయన నేనూ ఒకేసారి సినిమా కెరీర్ ప్రారంభించాం. ఆ తర్వాత వందల కొద్దీ సినిమాల్లో ఎన్నెన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి, ప్రతి పాత్రని తన విలక్షణ, ప్రత్యేక శైలితో అలరించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్