మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న 158వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి ఒక హీరోయిన్‌గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు తగ్గట్టుగా 35 ఏళ్లు దాటిన హీరోయిన్లను ఎంపిక చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ నటులను కీలక పాత్రల కోసం సంప్రదిస్తున్నారు. ఈ సినిమా బాబీ స్టైల్‌లో పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా ఉండబోతోందని, పవర్‌ఫుల్ డైలాగులు, యాక్షన్ సీక్వెన్స్‌లతో మెగా మార్క్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉంటుందని సమాచారం.