చుక్కకూర.. భారతీయ వంటకాల్లో ఉపయోగించే పుల్లని ఆకుకూర. ఇందులో విటమిన్ సి, ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కంటిచూపును పెంచుతుంది, రక్తహీనతను తగ్గించి, రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పాలీఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు వాపులను, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అయితే కిడ్నీ స్టోన్లు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.