HCA కేసులో సీఐడీ ఛార్జిషీట్‌ దాఖలు

TG: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)లో జరిగిన భారీ ఆర్థిక అక్రమాలపై సీఐడీ 80 పేజీల ప్రాథమిక ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. సంస్థకు రూ.92.08 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో తేలింది. 63 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ఆధారంగా ఈ దర్యాప్తు సాగింది. జగన్మోహన్‌రావు ఫోర్జరీ పత్రాలతో అధ్యక్ష పదవిని పొందినట్లు ఆరోపణలు ఉండగా, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి నిధులు ఖర్చు చేయడం, టికెట్ల అమ్మకాల్లో భారీ వ్యత్యాసాలు, కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గుర్తించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕