కాఫీలో దాల్చిన చెక్క కలపడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పెరుగుతాయి. ఇది శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో, చక్కెర అవసరాన్ని తగ్గించడంలో సహాయపడే ఛాన్సుంది. రక్తంలో చక్కెర నియంత్రణకు కూడా తోడ్పడే అవకాశం ఉంది. అయితే, రోజూ ఎక్కువ మొత్తంలో, ముఖ్యంగా కాసియా దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.