నిప్పుల కుంపటిలా నగరాలు.. కారణాలు ఇవే!

భారత నగరాలు వేగంగా వేడెక్కుతున్నాయని, దీనికి వాతావరణ మార్పుల కంటే కాంక్రీట్ నిర్మాణాలే ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. నేచర్ సిటీస్ నివేదిక ప్రకారం, నగరాల్లో పెరుగుతున్న వేడికి 60 శాతం వరకు కాంక్రీట్ భవనాలు, తారు రహదారులు, గ్లాస్ నిర్మాణాలే కారణం. ఇవి పగటిపూట వేడిని పీల్చుకుని రాత్రి ఉష్ణాన్ని విడుదల చేయడంతో నగరాలు చల్లబడడం లేదు. పచ్చదనం పెంపు, కూల్ రూఫ్స్, సహజ గాలి–వెలుతురు వచ్చే నిర్మాణాలు, మియావాకీ అడవులు, నీరు ఇంకే రహదారులు వంటి చర్యలతో పట్టణాల్లో ఉష్ణోగ్రతలను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్