రాష్ట్రవ్యాప్తంగా నగరాలు సామాజికవర్గానికి బీసీ ‘డి’ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. తాడేపల్లిలో మంత్రి సవితను ‘నగరాలు’ సామాజికవర్గానికి చెందిన నేతలు కలిశారు. తమకు బీసీ 'డి' కులపత్రాలు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా అధికారులు పట్టించుకోవట్లేదని మంత్రి దృష్టికి నేతలు తీసుకొచ్చారు. దీనిపై మంత్రి సవిత స్పందించారు.