రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పౌర పురస్కారం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ఆమెకు అందించారు. ప్రపంచ వేదికపై భారతదేశం బలంగా ఉద్భవించినందున, ఫిజీని బలమైన, దృఢమైన, మరింత సంపన్నమైన దేశంగా నిర్మించడానికి భారత్ అండగా ఉంటుందని రాష్ట్రపతి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్