సీజేఐకి సివిల్స్‌ అభ్యర్థి లేఖ.. నరకాన్ని చూస్తున్నాం అంటూ!

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థి అవినాష్ దూబే లేఖ రాశారు. దేశ రాజధానిలోని రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ పరిధిలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉంటున్న విద్యార్థుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని పేర్కొన్నారు. కోచింగ్ సెంటర్లలో నిత్యం నరకయాతన అనుభవిస్తూ పరీక్షలకు సిద్ధమవుతున్నామని తెలిపారు. మురుగు కాల్వల నిర్వహణ సరిగ్గా లేదని విన్నవించారు.

సంబంధిత పోస్ట్