యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సోమవారం రాత్రి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష-2026 ఫలితాలను విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 13,343 మంది అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ ఏడాది మే 24న దేశవ్యాప్తంగా 83 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 8,19,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన వారు మెయిన్స్‌కు అర్హత సాధించారు. ప్రిలిమ్స్ మార్కులు తుది ర్యాంకుల నిర్ణయంలో పరిగణనలోకి తీసుకోబడవని UPSC స్పష్టం చేసింది.