సీజేపీ నేతలు సౌరవ్‌, అశుతోష్‌ విడుదల

ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఈ నెల 13న అదుపులోకి తీసుకున్న సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకాలపై దిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేటివ్‌ కోర్టు కీలక తీర్పునిచ్చింది. వీరిద్దరిని విడుదల చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది. పోలీసులు 14వ తేదీన వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడీషియల్‌ కస్టడీ విధించారు. ఏడు రోజుల కస్టడీ తర్వాత వీరిద్దరిని విడుదల చేయనున్నారు. అదుపులోకి తీసుకున్న సంఘటన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕