మహారాష్ట్రలోని జాల్నా జిల్లా, అంబాద్ పట్టణ ఆసుపత్రి ప్రాంగణంలో రెండు వర్గాల మధ్య తీవ్రమైన ఘర్షణ చోటుచేసుకుంది. ఆసుపత్రి లోపలే ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, లాఠీలు, కాళ్లతో దారుణంగా దాడి చేసుకున్నారు. ఈ భయానక ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.