బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. హైటెన్షన్

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బీఆర్ఎస్ గద్దెను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్‌పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గులాబీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. కాగా గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని.. బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్