TG: పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఆదివారం తెల్లవారుజామున రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అనుచరురాలు సౌమ్య, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అనుచరురాలు చంద్రకళ పోటీ చేస్తున్నారు. మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని లక్ష్మారెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఈ ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి, వారిని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.