TG: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దారుణం చోటు చేసుకుంది. సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషులు పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేశ్, గణేష్ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.