14 ఏళ్ల బాలికను ఆమె క్లాస్‌మేట్ అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు 14 ఏళ్ల నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలు, నిందితుడు ఒకే ప్రాంతానికి చెందనవారని, ఒకే పాఠశాలలో చదువుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.