స్క్రబ్ టైఫస్‌ను నివారించడానికి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, పాత బట్టలు, చెత్తాచెదారం తొలగించడం వంటి సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు. పొలాలు, అడవుల్లోకి వెళ్లేటప్పుడు పూర్తి చేతులు, కాళ్ల దుస్తులు ధరించాలని అన్నారు. చిగ్గర్ కాటు నుండి రక్షణ కోసం క్రీములు ఉపయోగించాలని పేర్కొన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.