హైదరాబాద్ నుంచి వెలువడే కాలుష్యం మూసీ నదిలో కలిసి నల్గొండ వరకు చేరుతోందని, దీనివల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పుట్టిన ఊరి నుంచి పిల్లలను బయటకు పంపే దుస్థితి నెలకొందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి నుంచి 20 టీఎంసీల నీటిని తరలిస్తున్నామని, మూసీ దుస్థితి ప్రకృతి తప్పిదం కాదని, మానవ తప్పిదమని ఆయన పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళన అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.