ప్రతిరోజూ లవంగం టీ తాగడం వల్ల శరీరానికి రక్షణ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. లవంగాల్లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయంటున్నారు. ఈ టీ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి సమస్యలను దూరం చేస్తుందని వివరిస్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంచి, సీజనల్ వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుందని, నొప్పులు, వాపుల నుండి ఉపశమనం కలిగిస్తుందంటున్నారు. నోటి ఆరోగ్యాన్ని, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని, రోజుకు ఒక కప్పు మితంగా తీసుకోవడం మంచిదని సూచిస్తన్నారు.