సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారు: KTR

TG: అప్పుల అంశంపై చర్చకు సిద్ధమని సవాళ్లు విసిరిన సీఎం రేవంత్, మంత్రులు చివరకు వెనక్కి తగ్గారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వస్తానని ప్రకటించడంతో ఆయన కోసం ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేసి గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. అనంతరం గన్‌పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు ప్రయత్నించిన హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. సీఎం, మంత్రులు తొడగొట్టి తోకముడిచారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్