మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి.. KCRకు సీఎం సవాల్

TG: కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ సవాల్‌ విసిరారు. బుధవారం సిరిసిల్లలో మాట్లాడుతూ.. 'దమ్ముంటే మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. హైటెక్‌ సిటీ పక్కన స్టార్‌ హోటళ్లు మీ పేరు మీద లేవని చెప్పగలరా ఉన్నాయని నేను నిరూపిస్తా.. లేకుంటే పేరు మార్చుకుంటా. మొన్నటి వరకు వేల కోట్ల ఆస్తులు ఆంధ్రా వారి పేర్లమీద ఉంటే.. ఆరు నెలల వ్యవధిలోనే మీ పేర్లపైకి ఎలా వచ్చాయి? మీకు అమెరికా, సింగపూర్‌లో పెట్టుబడులు ఉన్నాయి. దుబాయ్‌ పాస్‌పోర్ట్‌ బ్రోకర్‌ కొడుకుకి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయి?' అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕