ఎన్నికల సంఘం వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు

AP: ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈసీ వివరణ రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతను చాటిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు సంస్థాగత విధానాలకు అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) నిర్ణయాలు సమిష్టిగా తీసుకున్నవేనని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడం విచారకరమని చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕