జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

AP: వైఎస్ జగన్‌ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. "వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం మన మీద వేశారు. మనం అప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఎన్నికల్లో నష్టపోయాం. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కూడా ఆ కుట్రలను పసిగట్టలేకపోయింది. తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర కోణం ఉంది."అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్