AP: కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాల ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు సీఎంకు నివేదిక అందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు మైక్రో బయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మిరాజు, బయో కెమిస్ట్రీ LT గోపాలకృష్ణ, LT ప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కళ్యాణ్ చక్రవర్తి పరారీలో ఉన్నారు.