TG: మీనాక్షి నటరాజన్ నామినేషన్ వ్యవహారంలో విచారణ జరుగుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. 'కోవర్టులపై సీఎం విచారణ జరుపుతున్నారు. లీకువీరులు ఎవరో.. గ్రీకువీరులు ఎవరో బయటపడుతుంది. తెలంగాణలో మీనాక్షి నటరాజన్‌పై కేసు లేదు. గాంధేయవాది అని చూడకుండా నామినేషన్ తిరస్కరించారు. నామినేషన్ తిరస్కరించిన ఆర్వోను ఉరితీసినా తప్పులేదు' అని కామెంట్స్ చేశారు.