TG: కాళేశ్వరం కమిషన్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయి సమాచారం అందజేయలేదని తమకు అనుమానాలు ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎంకు నీటి వినియోగం, నీటి పంపకం మధ్య తేడా తెలియడంలేదు. ప్రభుత్వం ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్(PPP)లో సీఎం అబద్ధాలు చెప్పారు. మా పార్టీ తరఫున పీపీపీ ఇస్తాం. కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించారు' అని అన్నారు.