దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024లో కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనపై పునఃవిచారణకు ఆదేశించినట్లు సీఎం సువేందు అధికారి తెలిపారు. బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆమె లేఖ రాయడంతో, చీఫ్ సెక్రటరీ, నిపుణుల బృందంతో చర్చించి పునఃవిచారణకు ఆదేశించారు.