దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభించారు. హరియాణాలో జరిగిన వేడుకల్లో సీఎం నయాబ్ సింగ్ సైనీ, యోగా గురువు రాందేవ్ పాల్గొన్నారు. రాందేవ్ బాబా చేసిన యోగా విన్యాసాలు అక్కడ ఉన్న వారిని ఆకట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లోని ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు కూడా యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో జరగనున్నాయి.