న్యూ ఇయర్ వేడుకల్లో CM రేవంత్.. IASలతో కలిసి సెలబ్రేషన్స్

TG: బేగంపేటలోని IAS ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. IASలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా ఈ ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం మరింత ముందుకు సాగుతుంది. అందరి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రాధాన్యమిస్తాం' అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్