పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశానికి మరో పతకం సాధించిన షూటర్ స్వప్నిల్ కుశాల్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. షూటింగ్ ఈవెంట్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో స్వప్నిల్ కాంస్య పతకం సాధించారు. దీంతో కలిపి భారత్ సాధించినవి మూడు మెడల్స్ కాగా, రాబోయే ఈవెంట్లలోనూ మనవాళ్లు రాణించి పతకాలు గెలవాలని ఒక సందేశంలో ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.