ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన చికితకు సీఎం రేవంత్‌ అభినందనలు

ఆసియా క్రీడల్లో తెలంగాణ ఆర్చరీ క్రీడాకారిణి చికిత, సాహిల్‌ జోడి మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీలో స్వర్ణ పతకాన్ని సాధించింది. ఈ విజయంతో చికిత 2028 లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పెద్దపల్లికి చెందిన చికిత ప్రతిభపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. చికిత విజయం తెలంగాణ క్రీడా చరిత్రలో నిలిచిపోతుందని, ఆమె పట్టుదల క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. బుధవారం జరిగిన ఫైనల్లో చికిత, సాహిల్ జోడి దక్షిణ కొరియా జోడీని షూట్‌ఆఫ్‌లో ఓడించి స్వర్ణం కైవసం చేసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕