రావణాసురుడిగా CM రేవంత్ కటౌట్.. ఉద్రిక్తత

హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ రామ్ మైదానంలో దసరా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని రావణాసురుడిగా చిత్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన కటౌట్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న టీపీసీసీ నేత మెట్టు సాయికుమార్, తన అనుచరులతో కలిసి ఘటనాస్థలికి చేరుకుని కటౌట్‌ను తొలగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు పహారా కాస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕