సీఎం రేవంత్ దేశ గౌరవాన్ని దెబ్బతీశారు: బండి సంజయ్

TG: జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. 'పాకిస్థానోడు ముడ్డి మీద తంతే అక్కడ బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్‌లో గెలిపిస్తే ఇక్కడ కార్పొరేట్ బాంబింగ్ చేస్తారంట' అని రోడ్ షోలో రేవంత్ అనడంపై ఫైర్ అయ్యారు. 'రేవంత్ దేశ గౌరవాన్ని దెబ్బతీశారు. ఆయన వ్యాఖ్యలు పాక్ ఉగ్రశిబిరాలను ధ్వంసం చేసిన మన సైనికుల ధైర్యసాహసాలకే అవమానం. దేశ సైనికులకు రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి' డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్