TG: మీనాక్షి నటరాజన్ విషయంలో ఎవరు స్పందించారో అందరికీ తెలుసని, రాష్ట్ర కాంగ్రెస్ నుంచే సమాచారం వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ సమాచారం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలకు చేరిందని అన్నారు. తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి నాశనం చేస్తున్నారని విమర్శిస్తూ, రేవంత్ ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలున్నాయని దుయ్యబట్టారు.