SIR ప్రక్రియలో పార్టీ అలసత్వంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. గాంధీభవన్‌లో పీసీసీ రాజకీయ వ్యవహారాలు, అడ్వైజరీ కమిటీల సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో సీఎం మాట్లాడుతూ.. 'SIR ప్రక్రియలో హైదరాబాద్ పెర్ఫార్మెన్స్ పూర్ గా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇవ్వాలి. పార్లమెంట్, అసెంబ్లీ, డివిజన్ వారీగా కమిటీలు వేయాలి' అని సూచించారు.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఐదు క్లస్టర్ మీటింగ్ పెట్టాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలికి సూచించిచారు.