సీఎం రేవంత్‌ ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు: KTR

TG: సీఎం రేవంత్ ప్రతిపక్షాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఐడీని అడ్డుపెట్టుకుని పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్​ సభ్యులను సస్పెండ్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారి అవినీతి చేస్తున్నారని గవర్నర్​కు నివేదించినట్లుగా తెలిపారు. ప్రజాసంపద దోపిడీని అడ్డుకోవాలని కోరామన్నారు. కుంభకోణాలపై రేవంత్‌కు లేఖ రాశామని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్