'స్పందన' టీమ్‌లను ప్రారంభించిన సీఎం రేవంత్

TG: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారుల తక్షణ రక్షణ కోసం ఏర్పాటు చేసిన 'స్పందన' టీమ్‌లను సోమవారం సీఎం రేవంత్ ప్రారంభించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు, చిన్నారులకు వేగంగా రక్షణ కల్పించడమే ఈ టీమ్‌ల ప్రధాన ఉద్దేశ్యం. స్పందన సభ్యులకు బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి, నిందితులను ఎలా అదుపు చేయాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇవి డయల్ 100/112లతో అనుసంధానమై నిరంతరం అందుబాటులో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్