TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఇతర అంశాలపై చర్చించేందుకు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. తాజాగా పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను సీఎం రేవంత్ కలిశారు. గౌరవెల్లి, సీతారామ ఎత్తిపోతలు, డిండి, పాలమూరు-రంగారెడ్డి తదితర ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై భూపేందర్ యాదవ్‌తో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.