అక్రమ మైనింగ్ పై సీబీసీఐడి విచారణకు సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణ అసెంబ్లీలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందన్న హరీశ్ రావు వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు. 'ప్రతిపక్షం లేవనెత్తిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చాం. దానిపై చర్యలు తీసుకున్నాం. ఫైన్ కట్టించాం. 2014(బీఆర్ఎస్ హయాం) నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడి విచారణకు ఆదేశిస్తున్నా' అని సీఎం రేవంత్ తెలిపారు. CID విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తామన్నారు. ప్రభుత్వ ఆధాయానికి గండికొట్టేవారిని ఎవరిని వదిలిపెట్టం అని CM హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్