TG: సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉన్నది మూడు అడుగులని.. ఆరు అడుగులు ఎగురుతున్నాడుంటూ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ప్రగల్భాలు పలుకుతున్నాడని, దొరగారి గ్లాసులో సోడా పోయడం ఒక్కటే జగదీష్ రెడ్డికి తెలిసిన విద్య అంటూ పేర్కొన్నారు. గ్లాసులో సోడా పోసినంత ఈజీగా తుంగతుర్తికి గోదావరి జలాలు తీసుకురావడం కుదరదని తెలిపారు.