తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి సోమవారం సాయంత్రం ఢిల్లీ బయల్దేరారు. మంగళవారం ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్‌రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ వివరించనున్నారు.