సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మరోసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత అంశాలపై వీరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యంగా, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై కూడా చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, కాసేపట్లో వచ్చి భేటీ కావాలని సురేఖకు వేణుగోపాల్ పిలుపునిచ్చారు. కాసేపట్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి, మహేశ్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు.