ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్య, ఉపాధి, పెట్టుబడుల్లో సహకారం బలోపేతం చేయాలని సెర్జియోని సీఎం కోరారు. అమెరికాకు వెళ్లే రాష్ట్ర విద్యార్థులకు వీసాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు వీసా అపాయింట్‌మెంట్లు సకాలంలో ఉండేలా సహకరించాలని, వీసా ఇంటర్వ్యూ స్లాట్లను పెంచి దరఖాస్తుల పరిశీలన వేగంగా చేయాలని సెర్జియో గోర్‌ని సీఎం రేవంత్ కోరారు.