TG: ఎంసీఆర్హెచ్ఆర్డీలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్ర విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం.