వరంగల్‌లో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

TG: CM రేవంత్ రెడ్డి శుక్రవారం గ్రేటర్ వరంగల్‌లో వరద ముంపునకు గురైన సమ్మయ్యనగర్, పోతాననగర్, రంగంపేట ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటలకు హైదరాబాద్ బేగంపేట నుంచి బయలుదేరి, హుస్నాబాద్, వరంగల్ లోని దెబ్బతిన్న ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుని, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి మూడు కాలనీలలో పర్యటిస్తారు. .

సంబంధిత పోస్ట్