ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలవనున్నారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపనున్నారు. అనంతరం సచివాలయానికి వెళ్లనున్న రేవంత్ రెడ్డి, సాయంత్రం 4 గంటలకు ప్రజాభవన్ లో ఇరిగేషన్ పై నిర్వహించే పీపీటీకి హాజరుకానున్నారు.