TG: సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో సీఎం కరీంనగర్ చేరుకోనున్నారు. కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, సమీకృత కలెక్టరేట్ ప్రారంభంతో పాటు తెలంగాణ పబ్లిక్ సూళ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సిరిసిల్ల పర్యటనకు వెళ్లనున్నారు.