TG: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు భూపేందర్‌సింగ్, సీఆర్ పాటిల్‌ను సీఎం కలవనున్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతుల మంజూరుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే పలు పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై నీతి ఆయోగ్ అధికారులనూ సీఎం రేవంత్ కలవనున్నట్లు తెలుస్తోంది.